25/10/2024
నేను ఇవాళ కళ్ళారా చూసిన దారుణం: మిట్టమద్యాహ్నం, సరూర్ నగర్ చెరువు నడిరోడ్డు మీద..ఎవరో నలుగురు వచ్చారు. రెండు వైపులా ట్రాఫిక్ ఆపేసారు. ఒకడి చేతిలో కర్ర ఆ కర్రకి ఒక కత్తి ఉన్నాయి. ఫాక్షన్ సినిమాలో కరుడు కట్టిన విలన్‌లా నిర్దాక్షణ్యంగా..పరపరా కోశేసాడు..
అతని వేటుకి ఒక్కొక్కటిగా రాలి రోడ్డుపైన అడ్డదిడ్డంగా పడిపోయాయి.. స్కూలు బస్సులు, ఆటోలు,, బళ్ళమీద వెళుతూ ఆగిపోయిన వారంతా చోద్యం చూస్తూనే ఉన్నారు. ఒక్కరూ నోరు మెదపలేదు.. ఎవరూ? ఎందుకూ? అని గొంతెత్తి అడగలేదు..! వాళ్ళు వచ్చిన పని ఐపోయిందేమో.. రికామీగా బళ్ళేసుకుని వెళ్ళిపోయారు. రోడ్లపై ఆగి ఉన్న జనం, బళ్ళు ఎవరిదారిన వెళ్ళిపోయారు...
అందరూ వెళ్ళిపోఅయక రోడ్డంతా చిందరవందరగా బళ్ళు, బస్సులు తొక్కి పడేసినట్టుగా పడి ఉన్నాయి.. ఇంటర్‌నెట్ వైర్లు.. ACT, Airtel, Jio తారతమ్యం లేకుండా కోశేసారు..
ఇంతవరకు ఇంట్లో ఇంటర్‌నెట్ లేదు.. నేను, మా ఆవిడా, మా పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ.. డిన్నర్ చేసాం.. ఇంకాసిని కబుర్లు చెప్పుకుందామంటే..
హహ నాన్నా!
వైఫై లేకపోతే ఏంటి.. మాకు డాటా పాక్ ఉంది అంటూ.. మళ్ళీ ఫోన్లు తీసారు మా పిల్లలు..
Meta Phani Madhav Kasturi Funcounter Anirudh Ravichander